నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే..
► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి.
► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి.
► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
► ప్రాజెక్ట్ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్ చేయాలి.
► ప్రాజెక్ట్‌లు, లేబర్ క్యాంప్‌లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు.
► లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి.
► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్‌లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి.
► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. #covid_19 #realestate #lockdown #constructionworker #telangana #hyderabad