రెవెన్యూ భాష అర్థం చేసుకుంటే సులువే
రాజుల కాలం నాటి వాడుక పదాలే
గ్రామ కంఠం, అసైన్డ్ భూమి, పుంత పోరంబోకు.. ఇలా గ్రామంలోని భూములను ఒక్కో దానిని ఒక్కో పేరుతో పిలుస్తారు. వాడుకలో ఉన్న పేర్లైన వాటి అర్థాలు మాత్రం తెలుసుకోవడం కష్టమే. భూక్రయ విక్రయాల సందర్భంగా లేకర్లు దస్తావేజుల్లో రాసే అనేక పదాలు చాలా వరకు తెలియవు. కొన్ని సందర్భాల్లో భూములకు సంబంధించి వచ్చే సమస్యల పరిష్కారానికి వెళ్లితే రెవెన్యూ అధికారులు మాట్లాడే కొన్ని పదాలు కొంత మందికి అర్థం కావు. ఎక్కువుగా రాజుల కాలం నాటివి కావడంతో నేటి తరానికి వాటిపై అవగాహన తక్కువే. చాలా ప్రభుత్వ శాఖల్లో ఉపయోగించే పదాలు తెలుగు, ఆంగ్లంలోకి మారిన రెవెన్యూ శాఖలో మాత్రం చక్రవర్తులు, నిజాం కాలంనాటి పదాలే నేటికీ వాడుకలో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.