నేను, నా రియల్ ఎస్టేట్ టీంలు కలిసి గత 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఎంతో మంది కస్టమర్లకు అద్భుతమైన, మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రాపర్టీస్ ను అందించి వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నాము. ప్రత్యేకించి మేము, ప్రాపర్టీస్ ను అమ్మడం కంటే ఎక్కువగా, ఆ ప్రాపర్టీస్ పై కస్టమర్ లకు అవగాహన కల్పించడం పై ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాము.
రియల్ ఎస్టేట్మేము డీల్ చేసే ప్రతీ ప్రాపర్టీ ముందుగానే, గ్రౌండ్ లెవెల్ పరిశోధన చేస్తాము, అంటే మేము చేపట్టిన ప్రాపర్టీ కి సంబంధించి 1. లీగల్ ఒపీనియన్, 2. గవర్నమెంట్ అప్రూవల్, 3. ఏరియా అనాలిసిస్, 4. వెంచర్ డెవలప్మెంట్, 5. దర, 6. దాని అప్రిసియేషన్, 7. ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల పరిస్థితులు ఇంకా ఇలాంటివి ఎన్నో, అవన్నీ మాకు 100% సంతృప్తినిచ్చిన తరువాతనే ఆ ప్రాపర్టీ నీ కస్టమర్ దగ్గరకు తీసుకెళ్తాము.
ఒక సారి కస్టమర్ మా దగ్గర ప్రాపర్టీ తీసుకున్న తరువాత, మేము అందించే సర్వీసెస్:
1. కస్టమర్ కొన్న ప్రాపర్టీ ఎంత డెవలప్ అయింది, సమాచారాన్ని తరచుగా అందించడం.
2. ప్రాపర్టీ వున్న ఏరియా లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది సమాచారాన్ని తరచుగా అందించడం.
3. ప్రాపర్టీ ప్రైజ్ ఎంత పెరిగింది అనే సమాచారం అందించడం.
4. కస్టమర్ లకు అవసరమైనప్పుడు రేసేల్ విషయం లో సహాయం అందించడం.
5. మార్కెట్ ఎలా వుంది ఎప్పటికప్పుడు సమాచారం అందించడం.
6. కస్టమర్ లకు సర్వీస్ లు అందించడం కోసం ప్రత్యేక టీం లను కేటాయించడం.
ఇలా ఇంకా ఎన్నో సర్వీసెస్ లను అందిస్తూ వారి సంతృప్తి మా లక్ష్యం గా పని చేస్తాము.
కస్టమర్‌లు, ఏజెంట్లు మరియు డెవలపర్‌ల కోసం నాణ్యమైన రియల్ ఎస్టేట్ వీడియోలను అందించడానికి మా బృందం మరియు నేను “YouTube.com/shajwal” అనే YouTube ఛానెల్‌ను ప్రారంభించాము. ఈ ఛానెల్ ద్వారా మాకు చేతనైన కాడికి మాకున్న అనుభవాన్ని అందించడానికిప్రయత్నిస్తున్నాము, మీరు కూడా ఆదరిస్తున్నారు, మా ప్రయత్నం ఫలించింది, మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఇంకా మా టీం లో కొత్త కొత్త ఏజెంట్ లను చేర్చుకొని వాళ్ళకి తగినంత ట్రైనింగ్ కల్పించి మాలో ఒకరిగా కలుపుకుని అభివృద్ధి అయ్యే విధంగా తోడ్పడుతాము.
ఇక నుండి మా వ్యాపార కార్యకలాపాలు Shajwal (OPC) Private Limited, మీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వ్యాపార సంస్థ, దీని ద్వారా చేయనున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
మా అనుభవం మీకు ఉపయోగడుతుంది అని మీకు అనిపిస్తే, మీ రియల్ ఎస్టేట్ అవసరాలకు నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించండి.
సదా మీసేవలో, సంతోషంగా నేను, మా టీంతో.
VENKAT, M.B.A.,
Managing Director,
Shajwal (OPC) Pvt. Ltd.
(Find Your Dream Property)